Refractory Reflections

"Question all authority and tyranny that is cloaked as leadership, order, experience, scholarhip, ownership and entitlement, whether physical, verbal, intellectual, emotional or psychological. Never be afriad to call out the naked emperors in one's line of sight."

Blog Archive

Saturday, December 29, 2007

Andhra Pradesh Farmers Suicides (India, AP, Telugu)

రైతుల ఆత్మహత్యల పేరిట www.tadepally.com లో December 2007లో వ్రాయబడ్డ వ్యాస పరంపరకి, వ్యాఖ్యలకీ ప్రతిస్పందిస్తూ నేను వ్రాసిన వ్యాఖ్య:

ఈ బ్లాగుల్లో రాసే వారెవ్వరూ వ్యవసాయంతో ప్రత్యక్ష అనుభవమున్న వారు కారు (ఈ ప్రస్తుత వ్యాఖాత తో సహాను). సహపౌరులుగా రైతులు దు:ఖిల్లటాన్ని చూసి సౌజన్యంతో స్పందించగల సౌజన్యత కల వాళ్ళు. నెహ్రూ విధానాలు అనేక రకాలుగా సంకీర్ణాలు. ఓ పక్క సోషలిజం అంటూనే మరో పక్క టాటా బిర్లాల వంటి పెను కాపిటలిస్టులలకి అనుగుణమైన విధానాలని ప్రోత్సహించాడు. దేశంలోని పెద్ద బట్టల మిల్లులన్నీ విపరీతైమైన్ పన్ను రాయితీలనుభవించి, చేనేత పరిశ్రమలని అడుగంటించి ఈనాడు అమిత లాభవంతాలైనాయి.

నేహ్రూ ఉన్నత విద్యకీ, అదేవిధంగా భారీ పరిశ్రమలకీ చేసిన ప్రొత్సాహం అగణ్యం. ఈనాడు ప్రైవేటు రంగంలో తమ కంపెనీలకి కోట్లల్లో లాభాలార్జించి పెడుతున్న సాంకేతిక నిష్ణాతులందరూ (technical experts) ఒక నాడు జిల్లా పరిషత్ హైస్కూళ్ళలోనూ, లేదా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఉచితంగా చదువుకున్నవాళ్ళేను. ఉన్నతవిద్య వల్ల అందరికన్న ఎక్కువలాభపడే ప్రైవేటు పరిశ్రమల contribution ఎంత మాత్రం? నిజం చెప్పాలంటే ఈనాటికీ గుండు సున్నే. ఇండియాకీ, తక్కిన వర్ధమాన దేశాలకీ ఉన్న పెద్ద తేడా ఉన్నత విద్యలోనేను. ఈనాడు తామరతంపరగా బెంగుళూరులోనూ, పూనాలోను, హైదరాబాదులోనూ విస్తరిల్లిన IT పరిశ్రమకి మూల ఇంధనమైన విద్యాధికులని పెంచి పోషించినదెవరు? ఒక నాదు నెహ్రూ సార్వజనీనంగా ఏర్పరచిన ప్రభుత్వ విశావవిద్యాలయాలూ, ఇంజనీరింగ్/వైద్య కళాశాలలూ, కాకపోతేను? ఆదే విధంగా, ఇండియాలో భారీ పరిశ్రమలకీ, consumer goods ఉత్పాదించే పరిశ్రమలకీ పెట్టుబడి విషయంలో పెద్ద తేడా వుంది. ఆవు నోటి భాగాన్నీ, పొదుగు భాగానీ "సమంగా" పంచుకున్న అన్నదమ్ములలాగా - భారీ పరిశ్రమలన్నీ (అంటే, ఎనుము, ఉక్కు, భారీ ముడి సరుకులు, భారేఏ యంత్రాలు, నౌకా/రౌలు/విమాన నిర్మాణం, చమురు/గాసు ఉత్పాదన శస్త్రాస్త్రాల వంటివి) ప్రజా/ప్రభుతవ పెట్టుబడులతో పెట్టినవి; ఇక పోతే టూత్ పేస్టులు, తూథ్ బ్రష్షులు, సబ్బులు, వంటనూనెలు, స్నోలు, పొడర్లు, తలనొప్పి మందులు, ఎరువులు, పెస్టిసైదులు - ఇలాంటివన్నింటీకీ మాత్రమే పెట్టుబడి పెట్ట గల ప్రైవేటు రంగం. infrastructure రంగంలో ప్రైవేటు వాళ్ళు - అంటే రిలయన్సూ, LT ఇతరత్రా ప్రైవేటు గ్రూపులు ప్రవేశించడమనేది గత ఆరేడు సంవత్సరాల చరిత్ర. ఇప్పటికీ కూడా ఈ మెగా సంస్థల సంపాదనలో ఎక్కువ భాగం వినియోగదారీ వస్తువుల వల్ల సంపాదించేదేను.


సారాంశమేమిటంటే - నెహ్రూ గారి ముందుచూపు లేకుండా ఈనాటి ప్రైవేటు రంగం ఇంత పెద్దగా విస్తరించ్డేది కాదు. ఈనాటి వినియోగదారీ పరిశ్రమలన్నీ, నెహ్రూ గారు పూనుకున్న భారీ పరిశ్రమలనే మూలస్తంభాలపైన నిలబడుతున్నవేను.

మరి వ్యవసాయ రంగానికొద్దాము. ఇప్పటి సంగతేమో కానీ, నెహ్రూ గారు అధికారాన్ని చేపట్టే కాలానికి, ఇండియాలో ప్రతి ఐదిగురిలోనూ నలుగురు గ్రామీణులు - వ్య్వసాయం మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి బతుకుతున్న వాళ్ళు. ఆయన అంత మంది సంక్షేమాన్ని విస్మరించి విధానాలని ఎలా ఎంచుకోగలడు? ఏవిధంగానైతే పట్టణాలకీ, పరిశ్రమలకీ ప్రణాలికలు వేశి - ఉక్కు ఫాక్టరీలు, మెగా power ప్లాంట్లు, రోడ్లు, బ్రిడ్జీలు, రైళ్ళు, నౌకా/విమనాశ్రయాలు కట్టించాడో, అదే ఒరవడితోనొ, ముందుచూపుతోను - ఆనకట్టలు, పంటకాలవలు, విద్యుత్ సౌకర్యాలు వ్యవసాయం కోసం నిర్దేశించాడు. ఏదేశంలోనైనా భారీ పెట్టుబడులున్న infrastructure పథకాలని చేపట్టే బాధ్యత ప్రథమత: ప్రభుత్వాలే నెత్తిన వేసుకుంటాయి. Belgium లాంటి అతి చిన్న దేశాల నుండీ America వంటి అతి పెద్ద దేశాల వరకూ అదే ఆచారమూ, ఆచరణాను. అటు పైన అవి సఫలమయ్యే ఆర్ధిక రాయితీలిచ్చాడు, వ్యవసాయదారులకి. ఇది నేరమని ఎలా అనగలం? అమెరికాలోను, యూరోపులోనూ వ్యవసాయానికై ప్రభుత్వ కోశం లోనుంచీ విపరీతమైన రాయితీలు వెళతాయని ఎంతమందికి తెలుసు? ఆ రాయితీల వల్ల అమెరికాలోని ధాన్యాల కంపెనీలు మెక్సికో వంటి దక్షిణ దేశాల రైతుల బతుకులు భ్రష్టం చేస్తాయి కూడానని ఎంత మందికి తెలుసు?

అయితే ఆయన సదుద్దేశాలని పక్కదోవన పట్టించి, ఈనాటి దౌర్భాగ్యాని సృష్టించినదెవ్వరు? హరిత విప్లవం పేరిట ఎరువులు రసాయనాల కంపెనీలకి రైతులని బానిసలుగా మార్చిందెవరు? భూసారాన్ని తరాల తరబడీ నిలబెడుతున్న organic వ్యవసాయ పద్ధతులన్నిటికీ ఎగనామం పెట్టించి, తత్స్థానే భూసారాన్ని నాశనం చేశే రసాయన పద్ధతులని, విపరీతంగా నీరు తాగే పంటలని వేసుకొమ్మని అవిద్యావంతులైన రైతులని ప్రోత్సహించినదెవరు? వాటి కోసం ఎరువుల వ్యాపారులతో కుమ్మక్కై ఋణాలిచ్చిందెవ్వరు? చక్రవడ్డీలు గుంజిందెవ్వరు? ఈరకమైన ప్రైవేటు వడ్డీ వ్యాపారానికి నియంత్రణ లేదెందుకని? ఇక పోతే నాయుడుగారి హయాంలో జీవనది అయిన కృష్ణ ఏళ్ళ తరబడీ ఎండిపోయిందెందుకు? కర్ణాటకీయులు అక్రమంగా కృష్ణ నీటిని దోచినప్పుదు, మన IT visionary గారు నోరెత్తలేదెందుకని?

రసాయనిక విధనాలతో కంటె ఇతోధికంగా పంటలు పండిచి, భూసారాన్ని నిలంబెట్టుకుండె సస్య విధానలెన్నో సంప్రదాయికంగా ప్రచారంలో వున్నయి. ఒక ఉదాహరణగా MusanObu Fukuoka అనే Japan కార్యకర్త (Activst) వ్రాసిన The First Straw Revolution అనే పుస్తకం చదవండి.


ప్రభుత్వం ఇస్తున్న సేవలకై అందరికీ ఆదాయపు పన్ను వుండి తీరాల్సిందేను. అలాగే, విద్యుత్ , నీరు వంటి మౌలిక సదుపాయాలకి కూడాను మూల్యం చేల్లించవలసిందేను. అప్పుడే ఆయా సౌకర్యాలు మరింతగా బలపడి విస్తరించ గలవు. కానీ, తరాలుగా భూస్వామ్య గతమిన మన పాలక వర్గాలు తమ స్వార్ధం కోసం వ్యవసాయ విధానంలో బాధ్యతా రాహిత్యాన్ని, జవాబుదారీ హైన్యాన్నీ వెనకేసుకొచ్చారు. ఇందు కోసం సన్నకారు/బడుగు కమతందారలను దుయ్యబట్టడం ఎంతవర్కు సమంజసం? పల్లెటూళ్ళలో జూదం, మద్యపానం, అవిద్య, బహుభార్యాత్వం, స్త్రీ నిరాదరణ వంటి సాంఘిక దురాచారాలెన్నో పట్టణాల్లో కన్నా కొంచెం హెచ్చు మోతాదుల్లో కానవస్తాయి. కానీ అవేవీ బడుగు రైతులకు మాత్రమే పరిమితం కావు. బడుగు రైతుల దారిద్ర్యానికి మూలాలు పైవివరించిన విధానల్లో వున్నాయి.

వ్యాసకర్త, నాయుడు గారు సెలవిచ్చినట్లుగా, రైతుల దారిద్ర్యానికి పూర్తి బాద్యత రైతులదేననుకున్నప్పటికీ, రైతుల కమతాలు తగ్గంచి, రాయితీలన్నీ నిషేధించి, వారిని భూమిహీనులుగా చేసి - ఆ పిమ్మట ఏంచెయ్యలో చెప్పారుకారు.

ఇదే వాదనని మరి కొంత దూరం పొడిగిద్దాము. ఈనాదు మనమందరమూ darling గా కొనియాడే IT రంగం నిరవధికంగా దశాబ్దమున్నరపాటు హిరణ్యాక్ష వరాల్లాంటి రాయితీలని పొందుతోందని ఎంత మందికి తెలుసు? అందునా కుంభకర్ణుడిలా మదించిన IT కంపెనీలకి ఎందుకట ఇంతటి Unending Tax Honeymoon? ఇడే వాదన ప్రకారం పట్టణాల్లో కూడా ఎందరో విద్యాధికులు నిరుద్యోగులు, చిరుద్యోగులు చాలీ చాలని జీవితాలు వెళ్ళబుచ్చుతున్నారు. వాళ్ళనందరినీ వాళ్ళ ఉద్యోగాలకి అనర్హులుగా ప్రకటించి ఏ దుబాయికో చవక కార్మికులుగా తోలేద్దామా? అలాగే ఎందరో విద్యార్ధులు అత్తిసరు మార్కులతో పామునోట్లో మింగ/కక్క లేని కప్పల్లా కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళందరినీ కూడ పాఠశాలల్లోంచీ, కళాశాలల్లోంచీ తోలేస్తే? అద్లా వుంచితే, పట్టణాల్లో ఎందరో సన్నకారు వ్యాపారులు కూడా ఇదే స్థితిలో చాలీ చాలని వ్యాపార కమతాలతో బతుకుతూ వుంటారు. మరి వాళ్ళందరినీ ఏం చెయ్యాలి?


ఈమొత్తం వ్యాసంలో - వ్యవసాయదారులందరికీ కూడా ఉద్యోగులకీ, పట్టణ పరిశ్రమలకీ ఉన్న accountability ఉండాలన్న విషయంతో పూర్తిగా ఏకీభవిస్తాను. unregulated గా పెద్దచేపలు చిన్నచేపలని కబ్ళించగల ప్రభుత్వ విధానలని వేలెత్తి చూపడం కూడ అంతే అవసరం.


ఏసమాజానికైనా విస్తృతమైన ownership ఉన్నప్ప్పుడు అది మరింత సమత్వాన్నీ, స్తైర్యానీ (stability) సాధిస్తుంది. అమెరికా వంటి దేసాల్లొ, efficiency పేరిటా మిల్లియన్ల ఎకరాలని కార్పరేషన్లు కైవశం చేసుకోడం దశాబ్దాలకింద జరిగింది. వ్యక్తిగత కమతందార్లు నామకార్ధపు యజమానులు మాత్రమేను. వారి పొలంలో ఏంపండిస్తారో నిర్ణయించే అధికారం వాళ్ళకు లేదు. దాని మీద ఎంత గిట్టుబాటవుతుందో అంతకన్న లేదు. కార్పరేషన్ల చేతుల్లో పావులు మాత్రమేను. ఇదే రకమైన కార్పరేట్ విశృంఖలత్వం స్వైర విహారం చేస్తోంది - సంపన్న దేశాల్లోని అన్ని రంగాలలోనూ. అటువంటి వ్యవస్థ కావాలని కోరడంలో గల దూరదృష్టి?

- Hari Krishna

Theme and Charter

I am Hari Tadepalli, your average educated Joe living in the Southwestern part of the United States. In his autobiography, famous physicist Richard Feynmann recalls his father coaching him to question anything and everything unto death. There was another man called Mohandas Gandhi, who thought it to be the quintessence of his existence to stare in the face of ruthless authority with his moral courage and unentertaining questioning.

This blog will not pontificate, nor will it seek to promote my personal fantasies as the collective will, nor will it glorify my personal experiences. My motto is to state stark naked facts that conclude a bias of my own. It will be irreverent, unobseqious and yes, refractory to ruling consensus at times. This will not be a place for mutual congratulations and admirations. I leave it to your judgement whether they reflect my personal whims or whether you as the reader can relate to them as well.

Quotes of my own creation

"There is no human endeavor that can not succeed, except the one that has not been tried hard enough"

"There is no such thing as an unanswered question, except the one that has not been asked loud and often enough"

"Question all authority and tyranny that is cloaked as leadership, order, experience, scholarhip, ownership and entitlement, whether physical, verbal, intellectual, emotional or psychological. Never be afriad to call out the naked emperors in one's line of sight"